జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని మమత హాస్పిటల్ లో నిరుపేద రోగుల రక్తం తాగుతూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని బాధితులు తెలిపారు. జమ్మికుంట పట్టణ మరియు గ్రామీణ ప్రాంత నిరుపేద రోగులు ఆసుపత్రికి రాగానే టెస్టుల పేరుతో పెట్టుకొని వేలకు వేలు దోచుకుంటున్నారు. ప్రాణాల మీద ఆశతో ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు ఉంటాయో లేవో ప్రాణం కంటే ఏమి ఎక్కువ అని అప్పు చేసి ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తే నిరుపేద రోగులు టెస్టుల కొరకు తమ రక్తాన్ని శాంపిల్స్ తీసుకొని నిర్లక్ష్యంగా వ్యవహరించి శాంపిల్స్ మిస్ అయ్యాయని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పట్టణానికి చెందిన మహిళ థైరాయిడ్ టెస్ట్ కోసం రక్త నమూనా ఇవ్వగా, 20 రోజులు మండుటెండలో ఆస్పత్రి చుట్టూ తిప్పుకొని, చావు కబురు చల్లగా చెప్పినట్టు శాంపిల్ పోయింది మళ్లీ రక్తం ఇవ్వండి అని నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారు. సదరు రోగి రిపోర్టు అందకపోవడంతో సరైన చికిత్స అందక మరింత అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. రోగుల పట్ల ఇంత నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తున్న మమత హాస్పిటల్ యజమాన్యంపై జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి చర్యలు తీసుకోవాలని,రాష్ట్ర వైద్య ఆరోగ్య పరిషత్ కు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు బాధితులు తెలిపారు.