బ్రతుకు దేరువు కొరకు మహారాష్ట్ర నుండి జమ్మికుంటకు వచ్చి గత కొంత కాలంగా జమ్మికుంటలో కూలి పనిచేసుకుంటూ ఉండే రాకేష్ అనే యువకుడు మద్యానికి అలవాటు పడి తేదీ.01-06-24 శనివారం రోజున రాత్రి అతిగా మద్యం తాగి జమ్మికుంట హౌసింగ్ బోర్డ్ కాలనీలో పడిపోగా తల ముందు భాగం వైపు పెద్ద గాయం అయి చనిపోయినాడు. మృతుని యొక్క పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. మరణించిన యువకుని వివరాలు ఎవరికైనా తెలిస్తే ఫోన్ నెంబర్ 87126 70776 గల నెంబర్ కు తెలియజేయాలని జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి తెలిపారు