రాజన్న సిరిసిల్ల కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామంలో పేకాట ఆడుతున్న ఆరుగురు నిందితులను బుధవారం కోనరావుపేట ఎస్సై ఆంజనేయులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల నుంచి 2970 రూపాయలు, 6 చరవాణిలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా పేకాట ఆడుతున్న ఆరుగురు పై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన ప్రకటన విడుదల చేశారు.


