Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAపాఠశాల కళాశాల గురుకుల హాస్టల్స్ లల్లో ఫిర్యాదు బాక్స్ ఏర్పాటు చేయాలి

పాఠశాల కళాశాల గురుకుల హాస్టల్స్ లల్లో ఫిర్యాదు బాక్స్ ఏర్పాటు చేయాలి

పాఠశాల కళాశాల గురుకుల హాస్టల్స్ లల్లో ఫిర్యాదు బాక్స్ ఏర్పాటు చేయాలని నిఘా పెట్టాలని కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్,.జిల్లా ఎస్పీ లకు ఏబీవీపీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చిన ఈ సందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ మాట్లాడుతు రాజన్న సిరిసిల్ల జిల్లాలో తరచు అనేక సంఘటనల వల్ల విద్యార్థులు వేధింపులకు గురవుతున్నారని ఈ విషయం పైన జిల్లాలో జరుగుతున్న వేధింపుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ లని కోరామన్నారు. ఈ విషయంలో ముమ్మాటికీ డి ఈ ఓ నిర్లక్ష్యమే కారణమని DEO తన కార్యాలయం నుండి కదలడం లేదని ఎలాంటి తనిఖీ లు చేపట్టడం లేదని గతంలో విద్యార్థుల సమస్యలపైన అనేక ఫిర్యాదులు చేసిన డి ఈ ఓ పట్టించుకోలేదని విమర్శించారు. పలు ప్రైవేట్ స్కూళ్ల నుండి డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయని అతని పై సరైన విచారణ జరిపి చర్యలు తీసుకుని DEO ను సస్పెండ్ చేయాలని విద్యార్థినిలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేక ఇబ్బందులకు గురవుతున్నారని విద్యార్థుల సంఖ్యకు అనుకూలంగా టీచర్స్ లేక చదువుకు దూరం అవుతున్నారని టీచర్ ల కొరత తీర్చాలని కోరారు. గర్ల్స్ గురుకుల హాస్టల్స్ లో కూడా నిఘా పెట్టాలని వారికీ నాణ్యమైన ఆహారం అందడం లేదని వారికీ నాణ్యమైన ఆహారం అందించాలని, విద్యార్థినిల రక్షణకై ప్రతి స్కూల్ హాస్టల్స్ గురుకులల్లో కళాశాల లో ఫిర్యాదు బాక్స్ లను ఏర్పాటు చేయాలనీ ప్రతి నెల పాఠశాలలతో పాటు గురుకులాల్లో తనిఖీ లు చేయాలనీ కొరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్, జిల్లా కన్వీనర్ లోపేల్లి రాజు రావు, లా ఫోరమ్ విభాగ్ కన్వీనర్ సమానపల్లి ప్రశాంత్, టౌన్ సెక్రటరీ ఎలాగందుల శ్రీనివాస్, పూజం కార్తీక్, నవీన్, మహేష్, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments