Wednesday, May 29, 2024
spot_img
HomeANDHRA PRADESHఅమర్‌నాథ్‌ అవినీతికి హద్దులేదు

అమర్‌నాథ్‌ అవినీతికి హద్దులేదు

అనకాపల్లి అర్బన్‌: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తేవడంలో పూర్తిగా విఫలమయ్యారని, అక్రమార్జనలో మాత్రం సఫలమయ్యారని టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి బుద్దా వెంకన్న ఆరోపించారు. ఆదివారం ఇక్కడ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. గతంలో విశాఖలో ‘విజయసాయిరెడ్డి టాక్స్‌’ అమల్లో ఉండేదని, అతని అవినీతి పెరిగిపోవడంతో జగన్‌ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి పదవి నుంచి తప్పించాక ఇప్పుడు ‘అమర్‌నాథ్‌ టాక్స్‌’ అమలవుతున్నదని ఆరోపించారు. అనకాపల్లి జిల్లాలో రాయి క్వారీల యజమానులను బెదిరించి భారీగా మామూళ్లు వసూలు చేస్తున్నారని, రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు ఎక్కడ లేఅవుట్‌ వేసినా వాటా ఇవ్వాలని మంత్రి హుకుం జారీ చేస్తున్నారని తెలిపారు. రాయలసీమ సంస్కృతిని అనకాపల్లికి తీసుకువచ్చారన్నారు. అమర్‌నాథ్‌ భూదాహానికి అడ్డూఅదుపు లేకుండా పోతోందని, పరిపాలన రాజధాని పేరుతో భూములను కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను, ప్రభుత్వ ఆస్తులను ఎలా దోచుకోవాలో సీఎం జగన్‌ మంత్రులకు శిక్షణ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments