ఎల్లారెడ్డిపేటలో నాలుగు నెలల తన కూతురు టీకా వికటించి మృతి చెందిందని తండ్రి బుర్కా రాకేష్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయగా పూడ్చిపెట్టిన చిన్నారి డెడ్ బాడీని బయటకు తీసి పోస్టుమార్టం చేసిన నేపథ్యంలో బుధవారం ప్రత్యేక వైద్య బృందం కమిటీ ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని చిన్నారి తల్లిదండ్రులను పిలిచి వారి ఎదుట విచారించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో DMHO సుమన్ మోహన్ రావు మాట్లాడారు. నాలుగైదు రోజుల్లో సంబంధిత పూర్తి వివరాలను జిల్లా కలెక్టర్ తో పాటు కుటుంబ సభ్యులకు అందజేస్తామని పేర్కొన్నారు.