రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ సామాజిక ఆరోగ్య కేంద్రం నూతన భవన నిర్మాణం జాడలేదు గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేసినప్పటికీ నిర్మించకపోవడంతో ప్రస్తుతం ఉన్న ఆసుపత్రిలో ఆరు పడకలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఆసుపత్రికి వచ్చే రోగులు ఇటు ఆసుపత్రి నూతన భవనం లేక, సిబ్బంది లేక త్రీవ ఇబ్బందులు పడుతున్నారు. 2022 సెప్టెంబర్ నెలలో సామాజిక ఆరోగ్య కేంద్రం 100 పడకల ఆస్పత్రిలో సిబ్బంది కొరత ఉండడంతో ఆసుపత్రికి వచ్చే రోగులు వేచి చూసే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంపై సిరిసిల్ల సూపరింటెండెంట్ మురళీధర్ రావును వివరణ కోరగా 13 మంది సిబ్బంది వస్తున్నారని వారంలోగా సిబ్బంది జాయిన్ అవుతారని తెలియజేశారు. 100 పడకల ఆసుపత్రి లేక చిన్న భవనంలోనే ఆసుపత్రి కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి 100 పడకల ఆసుపత్రిని నిర్మించాలని మండల ప్రజలు కోరుతున్నారు