ఎం.ఎల్.ఏ. వినయ్ భాస్కర్ నిర్లక్ష్యంతో హన్మకొండ వాసులకు అభివృద్ధి ఫలాలు అందని ద్రాక్షలా మారాయని మధ్యలోనే ఆగిన స్మార్ట్ సిటీ పనులు, అందుబాటులోని రాని నూతన అండర్ డ్రైనెజ్ వ్యవస్థ చూస్తుంటే బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో వరంగల్ పశ్చిమ అభివృద్ధి శూన్యం అన్నారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి. ప్రజాదీవన యాత్ర ఈ రోజు హన్మకొండ 9 వ డివిజన్ లో గొల్లపల్లి పెట్రోల్ పంప్ నుండి ప్రారంభమై మైసమ్మ గుడి, ప్రోగ్రెస్ స్కూల్, రెడ్డి కాలని, న్యూ రాయపూర, గణేష్ నగర్, IK గార్డెన్ మీదుగా సాగి కాకతీయ కాలని ఫేసే-2 వద్ద ముగిసింది. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లో గత నాలుగు సార్లు గెలిచినా స్థానిక ఎం.ఎల్.ఏ గా దాస్యం వినయ్ భాస్కర్ గెలిచి అభివృద్ధికి ఆటంకంగా మారాడని తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఒకసారి ఎం.ఎల్.ఏ. గా ఉన్న సమయంలో అభివృద్ధి సాధించలేక పోయానన్న వినయ్ భాస్కర్ రెండు పర్యాయాలు ఎం.ఎల్.ఏ. గా ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా అభివృద్ధి చేయకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో కే.సి.ఆర్. వరంగల్ పశ్చిమలో దాస్యం వినయ్ భాస్కర్ ఉద్యమాల పేరుతో, బంగారు తెలంగాణా నాటకాలతో, మాయమాటలు చెబుతూ, అప్పుల పాలు చేస్తూ పేద ప్రజల సంక్షేమానికి సయింధవుడిగా మారాడన్నారు.
తెలంగాణా ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణా రాష్ట్రాన్ని ఇచ్చిందని ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో తమ కలలు సాకారం చేసుకుందామంటే నిరాశే మిగిలిందని తెలంగాణాలో బడుగు బలహీన వర్గాలు యువకులఆశ అడియాసే అయిందని బాగుపడ్డది కేవలం కేసిఆర్ వారి కుటుంబం మాత్రమేనని తెలంగాణా రాష్ట్రాన్ని చెదలు పట్టినట్టు పట్టి తెలంగాణా రాష్ట్రాన్ని మొత్తం కే.సి.ఆర్ కుటుంబం దోచుకుందన్నారు. TSPSC వైఫల్యం వల్ల, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో విద్యార్థి యువజన వర్గాలు తీవ్ర నిరాశలో కూరుకుపోయారని యువకుల బలిదానాల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం యువతను నిర్వీర్యం చేసిందని పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించింది కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.
తెలంగాణా రాష్ట్రము ఏర్పాటు విషయంలో మాట నిలబెట్టుకున్నట్లే ఇప్పుడు కాంగ్రెస్ గ్యారంటీ లన్నింటిని మాహలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం మరియు చేయూత ఈ 6 గ్యారంటీ స్కీం లను తక్షణమే అమలు చేస్తామని కాబట్టి మనం కన్న కలలు, మన అభివృద్ధి సాధించుకోవాలన్నహస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అద్యక్షుడు మహమ్మద్ జాఫర్, వరంగల్ పార్లమెంట్ ఇంచార్జి రవీంద్ర ఉత్తం రావు దాల్వి, ఏఐసిసి వరంగల్ వెస్ట్ ఇంచార్జి సంజయ్ జాగీర్దార్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ అజీజ్ ఖాన్, కార్పోరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, సయ్యద్ విజయశ్రీ రజాలి, డివిజన్ అద్యక్షుడు మొహమ్మద్ జాఫర్, సీనియర్ నాయకులు పులి రాజు, మాజీ కార్పొరేటర్లు ఏ. నాగరాజు, సి.పి.ఐ జిల్లా నాయకులు రవీందర్, మొహమ్మద్ అంకుష్ తదితరులు పాల్గొన్నారు.