ఓ మహిళా గుడుంబా అమ్ముతున్న తరుణంలో ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడగా స్థానిక తహసీల్దారు ముందు బైండొవర్ చేసినా మళ్ళీ యధావిధిగా గుడుంబా అమ్ముతున్న మహిళను కరీంనగర్ జైలుకు రిమాండుకి పంపామని ఎక్సైజ్ సీఐ వెల్లడించారు. ఎక్సైజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముస్తాబాద్ మండలానికి చెందిన పల్లెపు రాధిక గతంలో గుడుంబా అమ్ముతూ ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడగా స్థానిక తహసీల్దార్ ముందు ఒక సంవత్సర కాలానికి, లక్ష రూపాయలకు బైండోవర్ చేశామని అయినప్పటికీ మళ్లీ ఇటీవల రెండుసార్లు గుడుంబా అమ్ముతూ పట్టుబడగా తాసిల్దార్ నోటీసులు ఇచ్చామని ఆ నోటీసులకు రిప్లై ఇవ్వకపోగా లక్ష రూపాయలు కట్టినందున ఎమ్మార్వో ఆదేశాల మేరకు గురువారం రోజు కరీంనగర్ జైలుకి రిమాండ్ పంపామని ఎక్సైజ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎవరైనా ఇక ముందు బైండోవర్ ఉల్లంఘించిన, నాటు సారా తయారు చేసిన అమ్మిన, రవాణా చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ హెచ్చరించారు.