రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి మేజర్ గ్రామపంచాయతీ కేంద్రంలో పల్స్ పోలియో సందర్భంగా చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. “నిండు జీవితానికి రెండే చుక్కలు” అంటూ పోలియో చుక్కలు వేయడం వలన చిన్న పిల్లలకు భవిష్యత్ లో పోలియో రాకుండా అరికట్టవచ్చని ఎల్లారెడ్డి పేట సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రఘు, అంగన్ వాడీ వర్కర్లు పాల్గొన్నారు.