వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో సిటీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు కట్ల శ్రీనివాస్, 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్, 63వ డివిజన్ కార్పొరేటర్స్ విజయశ్రీ సయ్యద్ రజాలి ఆధ్వర్యంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో వరంగల్ పశ్చిమ నుండి కాంగ్రెస్ పార్టీలో జంగా రాఘవరెడ్డికే టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనునిత్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కష్టకాలంలో అండగా ఉంటూ ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడిన వ్యక్తి జంగా రాఘవరెడ్డి అని గతంలో అధిష్టానం ఆదేశాల అనుసారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ బాధ్యతలు ఇచ్చిన సక్రమంగా నిర్వహించి యావత్ జిల్లా కాంగ్రెస్ పార్టీని కాపాడిన వ్యక్తి జంగా రాఘవరెడ్డి అని అన్నారు.
గతంలో 2016లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నాలుగు కార్పోరేటర్ లను గెలిపించిన ఘనత జంగా రాఘవరెడ్డి దేనని 2021లో జరిగినటువంటి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలలో కూడా ఇద్దరు కార్పొరేటర్లను గెలిపించిన ఘనత రాఘవ రెడ్డి దన్నారు. ప్రజలలో బ్రహ్మాండమైన బలమున్న నాయకుడు అని అనునిత్యం ప్రజలలో ఉండి ప్రత్యక్షంగా కష్టసుఖాలు తెలుసుకునే నాయకుడు అని అన్నారు.
చావులకు, బ్రతుకులకు, వరదలు వచ్చి ముంపుకు గురైనటువంటి ప్రజలను అదేవిధంగా వైద్యానికి,విద్యకు దూరమైనటువంటి పేద ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ అధికారంలో లేకున్నా వారికి సేవలు అందిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి జంగా రాఘవరెడ్డి అని మా నాయకుడు జంగా రాఘవ రెడ్డి పైసలకు అమ్ముడుపోయే వ్యక్తి కాదని కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే వ్యక్తి అని ఇప్పటివరకు చరిత్ర చూసుకుంటే వ్యక్తిత్వాన్ని కానీ కాంగ్రెస్ పార్టీ అస్తిత్వాన్ని కానీ ఎక్కడా కూడా తాకట్టు పెట్టిన దాఖలాలు లేవు అని అన్నారు. ఇలాంటి నాయకునికి వరంగల్ పశ్చిమ లో టికెట్ ఇవ్వాలని మేము అందరం కూడా భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని వేడుకుంటున్నామని ఒకవేళ టికెట్ ఇవ్వని యెడల మేమందరం కూడా మూకుమ్మడి రాజీనామాలకు వెనుకాడబొమని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, డివిజన్ల అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు