Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAముస్లిం మైనార్టీల ఖబరస్థాన్ కోసం మూడు ఎకరాల స్థలం ఇప్పించాలి

ముస్లిం మైనార్టీల ఖబరస్థాన్ కోసం మూడు ఎకరాల స్థలం ఇప్పించాలి

కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన ముస్లిం మైనార్టీల ముద్దుబిడ్డ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ గౌస్ బాయి ని గుర్తించి ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని రిజర్వేషన్ లో భాగంగా అతని భార్య షేక్ సబేరా బేగం కు ఇచ్చినందుకు గర్విస్తున్నామని కాంగ్రెస్ పార్టీకి ఎల్లారెడ్డిపేట మండల ముస్లిం మైనార్టీ కమిటీ తరపున వారు కృతజ్ఞతలు తెలిపిన అధ్యక్షులు సాదుల్లా బాయి. నేడు ఎల్లారెడ్డిపేటలోని స్టార్ ఫంక్షన్ హాల్ లో ఎల్లారెడ్డిపేట ముస్లిం మైనార్టీ కమిటీ అధ్యక్షులు సాదుల్లా బాయి అధ్యక్షతన రాచర్ల బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తో పాటు పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట ముస్లిం మైనార్టీ కమిటీ అధ్యక్షులు సాదుల్లా బాయి, నవ తెలంగాణ సీనియర్ విలేకరి మజీద్, జిల్లా పరిషత్ మాజీ కోఆప్షన్ సభ్యులు చాంద్ పాష, జిల్లా మైనార్టీ అధ్యక్షులు సాహెబ్ లు మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ముస్లిం మైనార్టీల కు ఖబరిస్థాన్ స్థలం సరిపోడం లేదని మూడు ఎకరాల స్థలం ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎఏం సీ మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ సబీరా బేగం, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ భాయి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డిలు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ ల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన అందిస్తున్న ప్రభుత్వం మైనార్టీల అభ్యున్నతికి పని చేస్తుందని వారు గుర్తు చేశారు. మండల కేంద్రంలో ముస్లిం మైనార్టీల ఖబరిస్థాన్ కోసం మూడెకరాల స్థలం సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి తో మాట్లాడి ఇప్పించడానికి కృషి చేస్తామన్నారు.

మండల ముస్లిం మైనార్టీ కమిటీ ఆధ్వర్యంలో బొప్పాపూర్ ఏఎంసీ చైర్మన్ షేక్ సబేరా బేగం. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ బాయి, మార్కెట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ గుండాడి రామ్ రెడ్డి, డైరెక్టర్లు సూడిది రాజేందర్, గంటా లక్ష్మీ బుచ్చా గౌడు, పోన్నాల తిరుపతిరెడ్డి, మర్రి నారాయణరెడ్డి, మేడిపల్లి రవీందర్, గణేష్ నాయక్ లను శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి బాల్ రెడ్డి, మండల మైనార్టీ కోఆప్షన్ మాజీ సభ్యులు హసన్ బాయి, విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం విద్యాసంస్థల కరస్పాండెంట్ ఎండి లతీఫ్, ముస్లిం మైనార్టీ మండల యూత్ అధ్యక్షులు షరీఫ్, ఆర్ఎంపి వైద్యులు హైమద్, షాదుల్, మజీద్ కమిటీ అధ్యక్షులు జహంగీర్, మహమ్మద్ ఇర్ఫాన్, ఉపాధ్యక్షులు బాబా, అబ్దుల్, రజాక్, లాల్ మొహమ్మద్, గౌస్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments