ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి. ప్రభుత్వాలు ఎంత పారదర్శకంగా పనిచెయ్యాలనుకున్న అధికారులు మాత్రం తాము ససేమిరా మారం అంటున్నారు. నీతి నిజాయితీ తో పనిచేయాల్సిన అధికారులు అదేంటో తమకు తెలియదన్నట్లు ప్రవర్తిస్తున్నారు. అందుకు తాజా ఉదాహరణ ఏసీబీకి చిక్కిన సర్కార్ దవాఖాన సూపరింటెండెంట్. నల్లగొండ జిల్లా నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ లచ్చు నాయక్. హాస్పిటల్ కి మందులు సరఫరా చేసే కాంట్రాక్టర్ రాపోలు వెంకన్న నుండి 3 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. సూపరింటెండెంట్ లచ్చు నాయక్ ఇబ్బంది పెట్టడంతో ముందుగానే ఏసీబీ అధికారులను కలిసిన కాంట్రాక్టర్. లచ్చు నాయక్ ఇంట్లో ఈరోజు డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ. కొనసాగుతున్న తనిఖీ లు..