మతతత్వ పార్టీ అయిన బిజెపి పార్టీ, మోసపూరిత బిఆర్ఎస్ అలియాస్ టిఆర్ఎస్ పార్టీనీ నమ్మే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు లేరని “హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మిడిదొడ్డి రాజు” పేర్కొన్నారు. పార్టీ ఆఫీసులో జరిగిన సమావేశంలో రాజు మాట్లాడుతూ మతం పేరుతో గత పది సంవత్సరాలుగా యావత్ భారత దేశాన్ని బిజెపి పార్టీ మోసం చేస్తూనే ఉంది అన్నారు. ఇక బిఆర్ఎస్ పార్టీ మోసపూరితమైన విధి విధానాలతో రాష్ట్రాన్ని మరియు రాష్ట్ర భవిష్యత్తును మరో 10 సంవత్సరాల కాలం వెనుకకు తీసుకుని వెళ్లింది అని రాజు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత తెలంగాణా రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దలితుడే అని, ఇంటికొక ఉద్యోగం, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని గత 10 యేండ్లుగా రాష్ట్ర ప్రజలను మోసం చేసుకుంటూ కెసిఆర్ కుటుంబం మొత్తం రాజయోగం అనుభవించారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల ఒక్క కెసిఆర్ కుటుంబం తప్ప ఎవరి తల రాతలు మారలేదన్నారు. ఇంతటి నిరుద్యోగతకు కెసిఆర్ నియంతృత్వ పోకడే కారణం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మిడిదొడ్డి శ్రీనివాస్ గణేష్ ఆదినారాయణ కుమార్ లు పాల్గొన్నారు