రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో గుండెపోటుతో యువరైతు మార్పు జగన్ రెడ్డి (40) మృతి చెందాడు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మార్పు జగన్ రెడ్డికి గుండెపోటు రావడంతో ఆదివారం రాత్రి 12:00గంటలకు స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న సమయంలో తుది శ్వాస కోల్పోయాడు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. జగన్ రెడ్ది గత 15 ఏళ్లుగా బర్ల షెడ్డు,ఆవుల షెడ్డు నడుపుతూ జీవనం కొనసాగిస్తూ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో యువ రైతుగా పేరు తెచ్చుకున్నాడు. తన తండ్రి మరణాంతరం బండ లింగంపల్లి నుండి తన అమ్మమ్మగారైన ఎల్లారెడ్డిపేటకు వచ్చి తనంత తాను ఇల్లు కట్టుకొని జీవిస్తుండగా గుండెపోటు రూపంలో మృత్యువు వెంటాడింది. జగన్ రెడ్డి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నేరుగా విలపిస్తున్నారు.