గండేపల్లి మండలం మల్లేపల్లిలో వేoచేసియున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పాడ్యమి కార్తీక మాసం మొదటి శనివారం రోజున అన్న సమారాధన కార్యక్రమo నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉభయగోదావరి జిల్లాల ప్రోగ్రాం కమిటీ కోఆర్డినేటర్ రామకుర్తి నరసింహం ఆర్థిక సహాయంతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట జనసేన పార్టీ ఇన్చార్జి తుమ్మలపల్లి రమేష్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయపురోహితులు వైష్ణపు దాసు నాగేశ్వరరావు చేతుల మీదుగా రమేష్ కి సాలువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ దొమ్మ శ్రీను, చింతపల్లి భద్రరావు, చింతపల్లి సుబ్బారావు, ఉండమంట్ల వెంకటేశులు, వెలిది చిన్నోడు, చింతపల్లి వీరబ్బాయి, పితాని వీరబాబు, ఉండమంట్ల త్రిమూర్తులు, నరవ శ్రీను, దార్లంక నూకరాజు, రామకుర్తి బుజ్జి, కూటమి నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, ఇతర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరించారు.
ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద అన్న సమారాధనలో పాల్గొన్న తుమ్మలపల్లి రమేష్
RELATED ARTICLES