-సభలో పాల్గొన్న 3 వేల దళిత కుటుంబాలు.
-దళిత బందు సాధనకి ఏకమవుతున్న దళితులు.
-సీఎం ఆఫీస్ కి నేరుగా దళితుల వినతులు.
తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకంలో భాగంగా మొదటగా పైలట్ ప్రాజెక్టు గా హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్బంగా హుజురాబాద్ లో గల 4900 కుటుంబాలకు దళిత బంద్ నిధులు మంజూరి చేసి వారివారి అకౌంట్ లలో జమచేయడం జరిగింది.దుకాణాలు పెట్టుకున్న వారికి మొదటి విడత గా 5 లక్షలు ఇవ్వగా, రెండవ విడత 5 లక్షలు ఇంకా ఇవ్వవలసి ఉండే. కానీ గత ప్రభుత్వం ఇస్తాము అని కాలయాపన చేసి ఎన్నికల కోడ్ రావడంతో దళిత బంద్ నిధులకు బ్రేక్ వేసింది. ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో రెండవ విడత దళిత బంధు నిధులు వస్తాయా రావా అనే ఆందోళన దళిత కుటుంబాల్లో మొదలయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలు గడుస్తున్న దళిత బంధు పై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో దళిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.
ఇన్ని రోజులైనా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయక పోవడంతో దళిత బంధు రెండవ విడత సాధన కోసం హుజురాబాద్ నియోజకవర్గంలోని దళితులు శుక్రవారం జమ్మికుంట పట్టణంలోని సాయి గార్డెన్ లో దాదాపు 4 వేల మంది దళిత బందు లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేసుకున్న లబ్ధిదారులు మాట్లాడుతూ రానున్న రెండు మూడు రోజుల్లో దళిత బంధు నిధులపై ప్రభుత్వం స్పష్టమైన సమాచారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. లేని పక్షంలో నియోజకవర్గంలోని దళితులతో శాంతియుత దీక్ష చేయడానికి పూనుకుంటామని, రాస్తా రోకోలు చేస్తూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికలను బహిస్కరిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత బందు సాధన కమిటీ సభ్యులు కొలుగూరి సురేష్, మంద రాజేష్, కొలుగూరి నరేష్, రామంచ రాకేష్, గాజుల శ్రావణ్, మహేందర్, దాసారపు రాజు, నియోజకవర్గంలోని 5 మండలాల ఇంచార్జి లు, 3 వేల మంది దళితబంధు లబ్ధిదారులు పాల్గొన్నారు.