రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేటలో జోగుల నాంపల్లి అనే మిత్రుడు అనారోగ్యానికి గురై బాధపడుతూ సహాయ దాతల కోసం ఎదురుచూస్తున్న వేళ మిత్ర యూత్ సభ్యులు తలా ఇంత సమకూర్చి 22 వేల ఆర్థిక సహాయాన్ని అందజేసి మనోద్యైర్యాన్ని కల్పించి ఔదార్యాన్ని చాటుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన జోగుల నాంపల్లి గత కొన్ని ఏండ్లుగా లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. తోటి మిత్రుడు అనారోగ్యానికి గురి కావడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. మిత్ర యూత్ సభ్యులు స్వామి గౌడ్, కృష్ణారెడ్డి, వెంకట నరసింహారెడ్డి, దేవేందర్, రాఘవేందర్, సంజీవ్, సంతోష్ కలిసి నాంపల్లి ఇంటికి మంగళవారం వెళ్లి 22 వేల నగదును అందజేశారు.