ముస్తాబాద్ మండల కేంద్రంలోని పోతుగల్ ఆర్ అండ్ బి రోడ్డు నుండి పెద్దమ్మ లోళ్ల ఇళ్ల వరకు సిసి రోడ్ నిర్మాణం *MGNREGS 2023౼2024 నిధుల ద్వార అభివృద్ధి పనులకు భూమి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత గిరిజనుల బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడే పార్టీ అని గత ప్రభుత్వ హయాంలో పింఛన్లు ఉద్యోగాలు అనర్హులకు ఇప్పించుకున్నారు అన్నారు. ఆఖరికి గొర్ల పంపిణీ కార్యక్రమంలో కూడా స్కాములు చేశారు అని మండిపడ్డారు ఆ విధంగా ఊరికి నలుగురు మాత్రమే బాగుపడ్డారు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క పేదవారికి ప్రభుత్వ ఫలాలు చేకూరుతాయి అని అన్నారు. సీసీ రోడ్డు కు భూమి పూజ కార్యక్రమం నిర్వహించడంతో అక్కడ కాలనీవాసులు ఇన్ని రోజుల నుంచి మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు కేవలం ఎలక్షన్లకు మాత్రమే మమ్మల్ని వాడుకొని వదిలేశారు కానీ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన రెండు నెలల్లోనే మా బాధని అర్థం చేసుకొని రోడ్డు వేపిస్తుంది అని కాలనీవాసులు హర్షo వ్యక్తం చేస్తూ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతూ జడ్పిటిసి ఎంపీటీసీలకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి, జడ్పిటిసి గుండం నర్సయ్య, ఎంపిటిసి గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, ఎస్సీ సెల్, బి సి సెల్, యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా మండల, పట్టణ అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు