జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంటకు చెందిన సముద్రాల రమేష్ (30) అనే యువకుడు ఇంట్లో ఎవరు లేని సమయంలో చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ వరగంటి రవి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆబాది జమ్మికుంటకు చెందిన రజితను మొగుళ్లపల్లి మండలం పాత ఇసిపేట గ్రామానికి చెందిన సముద్రాల రమేష్, కు 7 సంవత్సరాల క్రితం ఇచ్చి వివాహం చేయగా వారికి ఒక బాబు ఒక పాప ఉన్నారు. అయినప్పటికీ మృతుడు రమేష్ బ్రతుకుతెరువు కొరకు అత్తవారి ఇల్లు అయిన ఆబాది జమ్మికుంటలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని జీవిస్తున్నాడు. గత వారం రోజులుగా అధికంగా మద్యం సేవించి భార్యను చిత్రహింసలు పెట్టగా అది భరించలేని రజిత గ్రామంలోని తన తల్లివారింటికి వెళ్ళగా మద్యానికి బానిసైన రమేష్, జీవితం పై విరక్తి చెంది అధివారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సిఐ వరగంటి రవి తెలిపారు..
Well miss you bhava ????????????