తెలంగాణ రాష్ట్రంలో ఆస్తి పన్నుల వసూళ్లలో 100 శాతం వసూళ్లు చేసి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించిన జమ్మికుంట మున్సిపాలిటీ కమిషనర్ మహమ్మద్ ఆయాజ్ ను బుధవారం ఉదయం అడిషనల్ కలెక్టర్, జమ్మికుంట మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ ప్రఫుల్ దేశాయ్ లు అభినందించారు. ఈ సందర్భంగా కమిషనర్ అయాజ్ మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి చెందిన పన్నుల వసూళ్లలో రాష్ట్రంలో మొదటి స్థానం సాధించడం సంతోషకరమని పన్నుల వసూళ్లలో సహకరించిన పట్టణ ప్రముఖులకు, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు, తాజా మాజీ వైస్ చైర్మన్ దేశీని స్వప్న, మాజీ కౌన్సిలర్ లకు, ప్రజా ప్రతినిధులకు, మున్సిపల్ అధికారులకు, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి, AE నరేష్, టీపీఓ శ్రీధర్, JAO రాజశేఖర్, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ భాస్కర్, వాణి, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు పలువురు పాల్గొన్నారు..
