విశాఖపట్నం: విశాఖలో దారుణం జరిగింది. ఓ బాలికపై పది మంది యువకులు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. అత్యాచారం తరువాత షాక్‌లోకి వెళ్లిన యువతి ఒడిసాలోని స్వగ్రామానికి వెళ్లింది. ఆమె కనిపించడంలేదంటూ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. ఆమె ఒడిసాలో ఉన్నట్టు గుర్తించి, విశాఖకు తీసుకువచ్చి వివరాలు సేకరించారు. అత్యాచారానికి పాల్పడిన యువకుల్లో కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిసాలోని కలహండి జిల్లా పనిముండ్ర గ్రామానికి చెందిన 44 ఏళ్ల వ్యక్తి విశాఖ నగరంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తూ కుటుంబంతో సహా కంచరపాలెంలో నివాసం ఉంటున్నాడు. ఇతని 17 ఏళ్ల కుమార్తె పోర్టు క్వార్టర్స్ సమీపంలో ఓ నేవీ అధికారి ఇంట్లో సహాయకురాలిగా పనిచేస్తోంది. గత నెల 17న పనికి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మరుసటి రోజు నాలుగో పట్టణ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. స్వగ్రామమైన పనిముండ్ర వెళ్లినట్టు గుర్తించారు. తల్లిదండ్రులను వెంటబెట్టుకుని అక్కడకు వెళ్లి బాలికను తీసుకువచ్చారు. అప్పటికే షాక్‌లో ఉన్న బాలిక ఎవరితోనూ మాట్లాడలేదు. కోలుకున్న తరువాత తనపై జరిగిన అఘాయిత్యం గురించి శనివారం తల్లిదండ్రులకు తెలిపింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. ఆమె చెప్పిన వివరాల మేరకు.. పదిమంది యువకులు, పలుమార్లు అనేక హోటళ్లలో అత్యాచారానికి పాల్పడ్డారు.
మోసం చేసిన ప్రియుడు?
బాధితురాలు కొన్నాళ్ల క్రితం స్థానిక యువకుడితో ప్రేమలో ఉందని, అతడి కోరిక మేరకు ఈ నెల 17న నాలుగో పట్టణ పీఎస్ దగ్గరలోని ఓ హోటల్‌కు వెళ్లినట్టు చెబుతున్నారు. అక్కడ వీరిద్దరూ శారీరకంగా కలిసిన తరువాత, ఆ యువకుడు తన స్నేహితునికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. అతను కూడా హోటల్‌కు చేరుకుని బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రేమించిన యువకుడే అతని స్నేహితునితో అత్యాచారం చేయించడాన్ని తట్టుకోలేకపోయిన బాలిక తీవ్ర మనస్తాపానికి గురై బీచ్‌కు చేరుకుని విలపిస్తుండగా, గుర్తించిన మరో వ్యక్తి (ఫొటో గ్రాఫర్ అని చెబుతున్నారు) ఓదార్చినట్టు నటించి స్నేహితుల గదికి తీసుకెళ్లాడు. ఆ గదిలో ఫొటోగ్రాఫర్‌తోపాటు మరో ఏడుగురు యువకులు బాలికను హింసించి, అత్యాచారం చేశారు. తరువాత నగర పరిధిలోని మరికొన్ని హోటళ్లు, లాడ్జిలకు తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనను సీరియ్‌సగా తీసుకున్న పోలీసులు చురుగ్గా విచారిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది నిందితులను అదుపులోకి తీసుకోగా, మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.