దాదాపు 28 నుండి 33 సంవత్సరాల సర్వీస్ పూర్తయినా రిటైర్మెంట్ కి దగ్గరవుతున్నా కేవలం ఒకే ఒక్క ప్రమోషన్ పొంది ఎదుగు బొదుగూ లేక ఇంకా వెట్టిచాకిరీ చేస్తున్న వైజాగ్ సిటీ మహిళా పోలీసులు. అదే సమయంలో పురుష పోలీసులు మాత్రం ఎస్సైలు సీఐలుగా పదోన్నతులు పొందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో 1985- 96 బ్యాచ్ ల మహిళా పోలీసు కానిస్టేబుళ్లు క్రమం తప్పక ప్రమోషన్లు పొందుతూ తమ ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలకు వెళ్తుంటే అదే 1985- 96 బ్యాచ్ లలో చేరిన విశాఖపట్నం నగర మహిళా పోలీసులు ఎం పాపం చేశారో అర్ధం కాక అధికారులు పట్టించుకోక ఇంకా కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ళగానే మిగిలిపోయారు. వీరి గోడు అధికారులు, పాలకులు కూడా పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకోవాలి. రాత్రి పగలు ఏ సమయంలో నైనా విధి నిర్వహణకు వెరవక అధికారులు చెప్పే ఏ డ్యూటీని అయినా సమర్ధవంతంగా నిర్వహించే విశాఖ సిటీ మహిళా పోలీసు కానిస్టేబుళ్లు ఇప్పటికైనా తగిన గుర్తింపుకు నోచుకుంటారని తమకు న్యాయంగా రావలసిన ప్రమోషన్లను పొందుతారని ఆశిద్దాం
1985-96 బ్యాచ్ ల వైజాగ్ సిటీ మహిళా పోలీసు కానిస్టేబుళ్లకు ప్రమోషన్లలో అన్యాయం
RELATED ARTICLES