నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకొని ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ మహిళ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ మహిళ పోలీస్ అధికారులు, సిబ్బందికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎక్కడ మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని మహిళలకు ఓర్పు, సహనం ఎక్కువని ప్రపంచానికి వెలుగు చూపేది మహిళ అని అన్నారు. పురుషులతో పోటీపడుతూ ఉద్యోగ అవకాశాల్లో, విధుల్లో వారితో సమానంగా మహిళలు పని చేయడం గొప్ప విషయం అని పురుషుల కన్నా మహిళకే పట్టుదల ఎక్కువ అని, కృషితో ఉద్యోగాలలో మరియు ఇతర రంగాల్లో పురుషులతో పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. ఉన్నతంగా ఆలోచించిన మహిళ తన కుటుంబాన్ని ఉన్నత స్థాయికి చేర్చే సత్తా ఉందని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళ పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి బెస్ట్ ఊమెన్ ఎంప్లాయ్ అవార్డ్స్ అందించి, శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ డిఎస్పీ సదయ్య, ఆసిఫాబాద్ సి.ఐ సతీష్, ఆర్.ఐ అడ్మిన్ పెద్దన్న, ఎస్.ఐ లు సోనియా, తేజస్విని మరియు మహిళ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..