రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన చెందిన అనరాసి కిష్టయ్య s/o దాదయ్య, 45సం, బేడ బుడగ జంగం అనునతడు ఇనుప సామాన్ దుకాణం నడుపుకుంటూ ఉండేవాడు. దొంగిలించిన ఇనుప సామన్ విక్రయించవద్దని గతంలో ఎల్లారెడ్డిపేట ఎమ్మార్వో ముందు బైండోవర్ చేసినప్పటికీ మారకుండా బైండోవర్ అతిక్రమించి దొంగ సొత్తు కొనగా అతనిపై ఎల్లారెడ్డిపేట పోలిస్ స్టేషన్ లో ఎస్సై రమాకాంత్ కేసు నమోదు చేయగా దీనిపై ఎమ్మార్వో 25వేల రూపాయలు జరిమాన విధించారు. మందాటి సంతోష్ s/o ఆశయ, 40సం, గొల్ల,r/o అక్కపల్లి గ్రామం మరియు బొమ్మనవేని పరుశరాములు s/o నర్సయ్య , 54సం, ముదిరాజ్,r/o బొప్పాపూర్ లు ఎలాంటి అనుమతులు లేకుండా బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నారని ఎమ్మార్వో ముందు బైండోవర్ చేసినప్పటికీ మారకుండా అదే విధంగా బెల్ట్ షాప్ నిర్వహించి బైండోవర్ అతిక్రమించగా వారిద్దరికీ కూడా ఎమ్మార్వో మాందాటి సంతోష్ కి పదివేల రూపాయలు, బొమ్మన వేని పరశురాములు కి 25వేల రూపాయలు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ శాంతి భద్రత లకు విఘాతం కలిగించే వ్యక్తులను ముందస్తు గా బైండోవర్ చేస్తామని, బైండోవర్ నందు తహసీల్దార్ నిర్దేశించిన గడువులోగా ఏదైనా కేసు వారి మీద అయినట్టు జరిగితే బైండ్ డౌన్ చేస్తామని దీని ప్రకారం అట్టి వ్యక్తులకు షూరిటీ మొత్తం లేదా జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఎలాంటి నేరాలకు పాల్పడకుండా ఏదైనా చట్ట పరమైన సమస్య ఉంటే పోలీస్ వారిని సంప్రదించాలి కానీ చట్ట వ్యతిరేకంగా వ్యవహరించకూడదని ఎల్లారెడ్డిపేట సీఐ బి శ్రీనివాస్ తెలిపారు.