రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ కు చెందిన గొట్టే ఎల్లం అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. మృతునికి భార్య ఆండాలు కొడుకు, కూతురు ఉన్నారు. వారి ఆర్థిక పరిస్థితి దయనీయ స్థితిలో ఉందన్న విషయం తెలుసుకున్న ముస్తాబాద్ మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులైన దీటి నరసింహులు ఆ కుటుంబానికి తనవంతు సహాయంగా 50 కిలోల సన్న బియ్యం ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో దీటి నరసింహులు, మచ్చ కొండయ్య, సుంచు శంకరయ్య, సుంచు కిషన్, ముక్క నరసయ్య, నాంపల్లి వెంకటయ్య, గొట్టె బాలనర్సు తదితరులు పాల్గొన్నారు