బుధవారం ఇల్లంతకుంట మండల కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు చెల్పూరి రాము మాట్లాడుతూ 2024-25 సంవత్సరానికి పార్లమెంట్‌లో నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశ పెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్ రైతులను, వ్యవసాయరంగాన్ని పూర్తిగా మోసం చేసే విధంగా ఉంది అని అన్నారు. వ్యవసాయరంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు పూనుకున్నదని రైతు వ్యతిరేకంగా ఉన్న ఈ బడ్జెట్‌ను సవరించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చేందుకు ఈ బడ్జెట్ పూనుకోలేదని పైగా, ఎరువులకు ఇస్తున్న సబ్సిడీలో కోత పెట్టేందుకు పూనుకున్నదని 14 వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరలను పెంచామని ఆర్థిక మంత్రి ప్రకటించారు కానీ, స్వామినాథన్ కమీటి సిఫార్సుల ప్రకారం రైతులు పెట్టిన పెట్టుబడికి 50 శాతం కలిపి మద్దతు ధర నిర్ణయించాలి కొనుగోలుకు చట్టబద్దత కల్పించాలి కార్పొరేట్లకు లక్షల కోట్లు రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం దేశంలో సగం మందికి పైగా ఉపాధిని చూపిస్తున్న వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం కావడం లేదు అని విమర్శించారు.
రుణమాఫీ ప్రస్తావనే తీసుకురాలేదు సహకార రంగాన్ని బడా కార్పోరేట్లకు కట్టబెట్టేందుకు పునుకుంటుంది అని అన్నారు. ఆహార సబ్సిడీగానీ, వడ్డీమాఫీ పథకానికి గానీ, వ్యవసాయ పరిశోధనలకు గానీ, పెరిగిన బడ్జెట్‌కు అనుగుణంగా కూడా నిధులు పెంచలేదని వడ్డీమాఫీ పథకానికి 2022-23 సంవత్సరంలో రూ.23,000ల కోట్లు ఖర్చు చేస్తే, ఇప్పుడు రూ.22,600 కోట్లు మాత్రమే కేటాయించిందని రీసెర్చ్ కొరకు 2022-23 సంవత్సరంలో రూ.1836 కోట్లు ఖర్చుచేస్తే ఇప్పుడు రూ.1200 కోట్లు మాత్రమే కేటాయించారని రీసెర్చ్ మొత్తాన్ని బడా కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్తున్నారని పంటల భీమా పథకంలో కూడా నిధులు కోత పెట్టారని ప్రధానమంత్రి ఫసల్‌బీమా పథకాన్ని భీమా కంపెనీలకు కాకుండా రైతాంగానికి ఉపయోగపడే విధంగా మార్చాలన్న రైతుల డిమాండ్ నెరవేర్చే ప్రయత్నం చేయలేదని రైతులకు పెన్షన్ ఇవ్వాలన్న డిమాండ్‌ను కూడా నెరవేర్చలేదని ఉపాధిహామీ పథకానికి కోతలు పెట్టిందని తెలంగాణ రాష్ట్రానికి విభజన హామీలు ఏ ఒక్కటి అమలు చేసేందుకు పూనుకోలేదని తెలంగాణ రాష్ట్రం నుండి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు, ఇక్కడి నుండి ఎన్నికైన 8 మంది పార్లమెంట్ సభ్యులు కేంద్రంపై ఒత్తిడి చేయాలని తెలంగాణ రైతు సంఘం కరీంనగర్ జిల్లా కమిటీ తరపున విజ్ఞప్తి చేశారు.