కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బెండార గ్రామపంచాయతీలోని బీసీ వాడ కాలనీ వాసులు నెలలుగా సమస్యలతో సతమతమవుతున్న అధికారుల జాడ కానరాలేక పోతుందని కాలని వాసులు తమ గొంతు వినిపించారు. ఈ సందర్భంగా కాలని వాసులు స్థానికులు మాట్లాడుతూ డ్రైనేజీల్లో సరైన సౌకర్యాలు లేక నాన అవస్థలు పడుతున్నామని కాలని వాసులు వాపోయారు. పలుమార్లు అధికారులకు తెలిసిన పట్టించుకోని అధికారులు ప్రజాప్రతినిధులని వారు పేర్కొన్నారు. డ్రైనేజీలు శుభ్రంగా లేనందున కాలనిలో దుర్వాసనతో ఆరోగ్యం పాడై పోతుందని మలేరియా డెంగ్యూ అనేక వ్యాధుల జ్వరాలతో హాస్పిటల్ కు పోయి నానా కష్టనష్టాలను అనుభవిస్తున్న అధికారులు పట్టించుకోకుండా తమ ఖర్మకు వదిలేశారని చెప్పుకొచ్చారు. కాలనిలో చేతిపంపు కూడా చెడిపోయిందని బీసీ వాడలో నెలలుగా డ్రైనేజీలు కాలువలను అధికారులు శుభ్రపరచడం, డ్రైనేజీల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం మర్చిపోయారని కాలనీ వాసులు శుక్రవారం ఆరోపించారు. వాడలో బ్లీచింగ్ పౌడర్ డ్రైనేజీల్లో చల్లాలని చేతిపంపు బోరింగ్ లో కొత్త పైపులు దించాలని, చేతిపంపుకు చైన్ కొత్తది వెయ్యాలని కోరారు. ఈ పరిస్థితి బెండారతో పాటుగా జైత్పూర్ బోర్డ, తేజ పూర్ తెజీగూడ, పలు గ్రామాల్లో మిషన్ భగీరధ లికేజిస్ ఉన్నాయని దీనిపై ఆఫీసర్లు శైలేందర్, స్టీపెన్ కి ఫోన్ లు చేసిన ఫలితం శూన్యమని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం గర్భిణీ స్త్రీలు మాట్లాడుతూ రెండుమూడు బిందెలకె చేతిపంపు బరువుగా మారి నీరు తగ్గిపోతుందని ఆపై కొట్టంగా కొట్టంగా బిందెలు నిండుతాయని అన్నారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన వారు స్పందించడం లేదని కాలనిలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో దోమలు వృద్ధి చెంది, రోగాలు వ్యాపిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.