రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఈరోజు ఉదయం గ్రామ శివారు ప్రాంతంలో ఆర్టీసీ బస్సు బైక్ డి కొనడంతో బైక్ పై ఉన్న ఇద్దరు యువకుల్లో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుడు రుద్రంగి కి చెందిన గండి అజయ్, మరో యువకుడు బోయిని అభిలాష్ కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..