రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన పద్మశాలి సంఘానికి 100 కుర్చీలు అందజేసిన సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి. ఈ కుర్చీలను మార్కండేయ జయంతి సందర్భంగా మార్కండేయ గుడి ఆవరణలో పద్మశాలి సంఘం సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం సభ్యులు చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ని శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, ఎంపీపీ పిల్లి రేణుక, సెస్ డైరెక్టర్ వరస కృష్ణ హరి, MPTC-I పందిర్ల నాగరాణి, MPTC-II ఎనగందుల అనసూయ, పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, నంది కిషన్, పద్మశాలి సంఘం అధ్యక్షులు రాపెల్లి దేవంతం, కార్యదర్శి వనం రమేష్, దూస శ్రీనివాస్, సుంకి భాస్కర్, దోమల భాస్కర్, వనం బాలరాజు, పోతు ఆంజనేయులు, మేగి నర్సయ్య, వనం ఎల్లయ్య, రాపెల్లి అంబదాస్, రాపెల్లి రమేష్, వనం శ్రీధర్, సుంకి ప్రకాష్, దొడ్ల సంజీవ్, గోషికే దేవదాస్, ఆడేపు అజయ్, బిఆర్ఎస్ నాయకులు పందిర్ల పరుశరాములు, ఎనగందుల నర్సింలు,సంఘ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.