రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో దేవాదాయ శాఖ మంజూరు చేసిన 50 లక్షల నిధులతో నిర్మించిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం విగ్రహ ప్రతిష్ట గావించిన వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి, ఎల్లారెడ్డిపేట మండల ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీ నాయకులు, నారాయణపూర్ మాజీ సర్పంచ్ నిమ్మ లక్ష్మి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, ఉప సర్పంచ్ మహేందర్, ఎంపీటీసీ అపేరా సుల్తానా, లద్దు నూరి హనుమాన్లు, లక్ష్మారెడ్డి పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.