రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం వ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షం గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కురవడంతో ఐకెపి సెంటర్లలో, కళ్ళాలలో ఉన్న వరి ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉరుములు మెరుపుల తాకడికి పలు ప్రాంతంలో విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. మరికొన్ని చోట్ల భారీ ఈదురు గాలులకు ఇంటి పైకప్పుగా గల రేకులు కొట్టుకపోయాయి. ఏది ఏమైనా ఆరుగాలం కష్టం చేసి చేతికి వచ్చిన పంటను తీసుకెళ్లి ఐకెపి సెంటర్లలో, కళ్ళాలలో కుప్పలుగా పోసి సుమారుగా నెల రోజులు దాటుతున్న అధికారులు ధాన్యం కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహించడం వల్ల ఎక్కడ పోసినధాన్యం అక్కడే వర్షానికి తడిసి ముద్దయింది దీంతో అన్నదాతలు చేసేదేమీ లేక తడిసిన ధాన్యమును చూస్తూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ధాన్యాన్ని ఆరబెట్టుకొనే పనిలో ఉన్నారు .ఇప్పటికైనా తమ బాధలను చూసైనా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఐకెపి సెంటర్లలోని, కళ్లాలలో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు..