దుబాయ్ నుండి ఎసిబి డిజి కి పిర్యాదు. రూ. 5000 లంచంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మనోహర్
జగిత్యాలలో బీర్పూర్ హెడ్ కానిస్టేబుల్ మనోహర్ సోమవారం ఏసీబీ కి రెడ్ హాండెడ్ గా పట్టుబడ్డారు. దుబాయ్ లో ఉన్న ఫిర్యాదుదారుడు తిరుపతి ఎసిబి డీజీ కి మెయిల్ ద్వారా పిర్యాదు చేశారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద రూ. 5000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు హెడ్ కానిస్టేబుల్ మనోహర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల పోలీస్ స్టేషన్ లో కోర్ట్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న మనోహర్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారి అయిన కేసులో పెర్కపల్లి గ్రామానికి చెందిన తిరుపతిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు అతని మామ గంగాధర్ వద్ద రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఎసిబి డిఎస్పీ రమణా మూర్తి, సి.ఐ. కృష్ణ కుమార్ లు తెలిపారు.