రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ రేణుక దంపతుల కూతురు పూజిత చదువుకుంటుండగానే ఐటి కంపనీ ఇన్ఫోసిస్ కంపనీలో ఉద్యోగం సాధించింది. మండలంలోని పలువురు యువతులకు ఆదర్శంగా నిలిచింది. పూజిత పదవ తరగతి వరకు గొల్లపల్లి జ్ఞాన దీప్ లో చదువుకుంది. హైదరాబాదులోని నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్, విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ నాలుగవ సంవత్సరం చదువుతుంది. క్యాంపస్ డ్రైవ్ లో భాగంగా ఇన్ఫోసిస్ కంపనీ ఇంటర్వ్యూ లో మంచి ప్యాకేజీ స్యాలరీతో సెలెక్ట్ అయింది. ఇన్ఫోసిస్ కంపనిలో ఉద్యోగానికి సెలెక్ట్ కావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు


