మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ రాజన్న సన్నిధిలో ఏర్పాట్లను ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రతీ ఏర్పాటు విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. గతంలో రాజన్న గుడి చైర్మన్ గా ఆది శ్రీనివాస్ రెండు పర్యాయాలు పనిచేశారు. గత అనుభవాల నేపథ్యంలో ఈసారి జాతరలో ధీటైన ఏర్పాట్లకు *ఆది రూపకల్పన చేశారు. ఆలయ అధికారులను సమన్వయపరుస్తూ జాతరలో ఎలాంటి లోటుపాట్లూ లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. జాతరకు వచ్చే ప్రతి భక్తుడూ సంతృప్తిగా స్వామివారిని దర్శనం చేసుకుని, క్షేమంగా తిరిగి వెళ్ళడానికి ఆది శ్రీనివాస్ నేతృత్వంలో సకలం సిద్ధమయ్యింది.