రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ లో ఈరోజు జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లో విజేతగా షటిల్ టీం గెలుపొందగా, రన్నర్ అప్ గా నిలిచిన పోలీస్ జట్టు. రెండు జట్లకు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ నేలకొండ అరుణ, క్రికెట్ మ్యాచ్ నిర్వాహకులు జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, బిఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య, ఎంపీపీ పిల్లి రేణుక, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, ఎంపీటీసీ ఎలగందుల అనసూయ బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ లు రమాకాంత్, రామ్మోహన్, రాజు, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు చాంద్ పాషా, కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు జబ్బర్, ఎంపీటీసీలు ఎలగందుల అనసూయ, సింగారం మధు, వరద బాబు, బిఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు అప్సరున్నిసా, రాజకీయాలకతీతంగా అన్ని పార్టీల నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, పాత్రికేయులు పాల్గొన్నారు.