చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి దశదిన కర్మ షామీర్పేట్ సమీపంలోని పుష్ప గార్డెన్ లో జరిగింది. ఈ సందర్భంగా రూపాదేవి చిత్రపటానికి ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆదివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ను పరామర్శించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏలూరి రాజయ్య, బుగ్గ కృష్ణమూర్తి శర్మ, షేక్ గౌస్ బాయి, పందిళ్ళ లింగం గౌడ్, కొమిరిశెట్టి తిరుపతి, మర్రి శ్రీనివాస్ రెడ్డి, జి మల్లేశం, బండారి బాల్ రెడ్డి, బొందుగుల దేవా రెడ్డి, ఓగ్గు బాలరాజు యాదవ్, బుచ్చి లింగి సంతోష్ గౌడ్, సూడిది రాజేందర్, బానోత్ రాజు నాయక్, భాస్కర్ జాదవ్, హీమాంబాయి, సలీం తదితరులు పాల్గొని రూపాదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు,