హైదరాబాద్: తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో నిజాం కాలేజీ విద్యార్థుల చర్చలు ముగిశాయి. హాస్టల్ కేటాయింపు విషయంలో ఓయూ వీసీ, నిజాం కాలేజీ ప్రిన్సిపాల్‌పై మంత్రి సబిత ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికీ హాస్టల్ కేటాయించాలని ఓయూ వీసీ, నిజాం కాలేజీ ప్రిన్సిపాల్‌కు మంత్రి సబితా ఆదేశాలు ఇచ్చారు.