సిడ్నీ: టెస్ట్ క్రికెట్‌ను చిన్నచూపు చూస్తున్న క్రికెట్ సౌతాఫ్రికా పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా విరుచుకుపడ్డాడు. ఈ నెల 10నుంచి జరుగనున్న సౌతాఫ్రికా టీ20 లీగ్‌కు ప్రాధాన్యమిస్తూ.. న్యూజిలాండ్‌తో జరిగే రెండు టెస్ట్‌లకు ద్వితీయశ్రేణి జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అరంగేట్రం కూడా చేయని నీల్ బ్రాండ్‌ను కెప్టెన్‌గా నియమించడంతోపాటు మొత్తం ఏడుగురు కొత్త ఆటగాళ్లను జట్టులో చేర్చారు. సీఎ్‌సఏ నిర్ణయం..టెస్ట్ క్రికెట్‌కు మరణ శాసనం లిఖించేలా కనిపిస్తోందన్నాడు. గౌరవం ఇవ్వనపుడు ఆ జట్టుతో ఎందుకు ఆడాలని న్యూజిలాండ్‌ను ప్రశ్నించాడు.