Home TELANGANA సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను GHMCలో విలీనం చేయడాన్ని వేగవంతం చేయాలి

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను GHMCలో విలీనం చేయడాన్ని వేగవంతం చేయాలి

0
137

నేడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును సందర్శించిన రక్షణ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ మిట్టల్ ని కంటోన్మెంట్ వికాస్ మంచ్ ప్రతినిధులు కలిసి కంటోన్మెంట్ ప్రాంతాన్ని తక్షణమే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) లో విలీనం చేయాలని కోరుతూ అధికారిక వినతిపత్రాన్ని సమర్పించారు.

కంటోన్మెంట్ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న పౌర సదుపాయాల సమస్యలను ప్రతినిధులు వివరించి, విలీన ప్రక్రియను అత్యవసర ప్రాతిపదికన పూర్తిచేయడానికి వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని మిట్టల్ ని కోరారు. దీనికి స్పందించిన మిట్టల్ ఈ అంశాన్ని తాను స్వయంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కారం దిశగా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ అంశానికి శాసనపరమైన మద్దతు లభించి ప్రక్రియ మరింత వేగవంతం కావాలనే ఉద్దేశంతో, కంటోన్మెంట్ వికాస్ మంచ్ తరఫున ఎంపీ ఈటల రాజేందర్ కి కూడా వినతిపత్రాన్ని సమర్పించి, కంటోన్మెంట్–GHMC విలీన అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించాలని కోరిన కంటోన్మెంట్ వికాస్ మంచ్ ప్రతినిధులు ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన ఇద్దరు నాయకులకు కంటోన్మెంట్ వికాస్ మంచ్ కృతజ్ఞతలు తెలియజేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజల శ్రేయస్సు కోసం GHMCలో విలీన ప్రక్రియ పూర్తయ్యే వరకు సంబంధిత అన్ని అధికారులతో పోరాటం మరియు అనుసరణ కొనసాగిస్తామని పేర్కొంది.

ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ వికాస్ మంచ్ ప్రధాన కార్యదర్శి సంకి రవీందర్ బాబు తో పాటు సభ్యులు ఎలగంటి ప్రభు గుప్తా, అంబాల శ్రీనివాస్, మహమ్మద్ ఫసిద్దిన్, గిరి, అరుణ్ యాదవ్, జమీల్ బాయ్, నర్సింగ్ రావు, నరేందర్, జై ప్రకాష్, పెనుమల్ రెడ్డి, కృష్ణ, వెంకట్రావు, బాబు బాయ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here