Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAసాగునీటికై సాగిన సర్పంచ్ చిగురు నరేష్

సాగునీటికై సాగిన సర్పంచ్ చిగురు నరేష్

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బంధనకల్ గ్రామంలోని రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయిన సాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ నూతనంగా ఎన్నికైన బంధనకల్ సర్పంచ్ చిగురు నరేష్ వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నీ కలసి పన్నెండవ ప్యాకేజీ 6R కాలువను మరమ్మత్తు చేసి బంధనకల్ గ్రామంతో పాటు మరో ఐదు గ్రామాలకు సాగునీటి సమస్యను తీర్చాలని వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాగునీటి కొరత తీవ్రంగా ఉన్న తన గ్రామానికి నీటిని అందించి సమస్య పరిష్కారం చేయాలని, రాబోవు వేసవికాలంలో వేసే వరి పంటలను దృష్టిలో ఉంచుకొని మరమ్మత్తులో ఉన్న కోమటి చెరువు ధమ్మ చెరువు మధ్యలో గల చింతమడక కాలువ వద్ద గల దాదాపు పది మీటర్ల పొడవు గల తెగిన కాలువను పూడిస్తే కాలేశ్వరం నుండి వచ్చే నీరు మాచాపూర్, శంకర్ నగర్, వెంకట్రావుపల్లి, బంధనకల్, మొర్రాపూర్, రాజక్క పేట గ్రామాలకు సాగునీరు అంది గ్రామంలోని పంట భూములను సస్యశ్యామలంగా చేస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా బంధనకల్ సర్పంచ్ చిగురు నరేష్, వెంకట్రావు పల్లె సర్పంచ్ సురభి దశరథరావు, మొర్రాపూర్ సర్పంచ్ రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments