తొమ్మిది యేండ్లలో రైతన్నలను ఆదుకోకపోతిరి, నేతన్నలకు 300 కోట్ల రూపాయలు బకాయి పెడితిరి. ప్రజలు ముమ్మల్నీ పదవిచ్యుతులను చేసీనా మీకు బుద్దిరాలే అన్నారు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోమ్మాటి నరసయ్య.
సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్ జిల్లా కేంద్రంలో శనివారం నేతన్నల కోసం దీక్ష చేస్తున్నామని అనడం హాస్యాస్పదంగా ఉందని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోమ్మాటీ నరసయ్య అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య మాట్లాడుతూ కెటిఆర్ దీక్ష చేయడం దొంగతనం చేసినోడే దొంగ దొంగ అని అరిచినట్టుందని అన్నారు. నేతన్నలను గాని రైతన్నలను గాని ఆదుకోవాలంటే వాళ్ళను భవిష్యత్తులో అభివృద్ధి చేయాలన్న అది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనే అది సాధ్యమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పా ఏ మార్గం లేదన్నారు. ధర్నా సందర్భంగా కేటీఆర్ మాట్లాడిన మాటలను చూస్తుంటే సిరిసిల్ల నియోజకవర్గం ప్రజలే నవ్వుకుంటున్నారని 9 ఏళ్లలో ఏం చేసినట్లు రైతన్నను ఆదుకోలే నేతన్నలకు 300 కోట్ల రూపాయలు బాకీ పెట్టిందీ మీరే కదా ఈ మాటలు చూస్తుంటే ఇవన్నీ కేటీఆర్ ఎత్తుగడలు అనిపిస్తుంది మీ ఎత్తుగడలను ప్రజలు తిరస్కరించి మిమ్ముల్ని అధికారం నుంచి కూల్చివేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో కూర్చో బెట్టారు కాబట్టి మీరు నిజాయితీగా ప్రజల మధ్యకు వచ్చి రాస్తారోకోలు ధర్నాలు చేసి ఎస్ మేము బకాయిలు పెట్టినం మీరు డబ్బు లివ్వాలే అని అడుగుతే అది సమంజమోమే అలా కాకుండా నువ్వే బకాయిలు పెట్టి నువ్వే ఆందోళనకు దిగి మేము ప్రభుత్వం వెంబడి పడతామని అనడం ఎంతవరకు సమంజసం అని ఆయన అన్నారు.
కల్లబొల్లి మాటలు బంద్ చేయండి ఇంకా మీకు సోయి రాలేదు ప్రజలు తిరస్కరించారు మేము దిగిపోయినాము ప్రజలు ప్రతిపక్షంలో కూర్చుండ బెట్టినారు అనే మాట మీరు ఇంకా గ్రహించడం లేదు మీ తండ్రి కెసిఆర్ ధోరణి ఇక్కడ నీ ధోరణి అట్లాగే ఉంది అని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇంకా అదికారంలోనే ఉన్నట్లు అభినయం చేస్తున్నారు ప్రతిపక్షంలో ఉన్నట్లు మీరు అభినయం చేయడం లేదు ఇప్పటికైనా మీ పద్ధతులను మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. తుక్కుగూడలో శనివారం జరిగిన భారీ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో పాల్గొని విజయవంతం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పందిళ్ళ లింగం గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో ఆశ లేకుండా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితలు కలిసి దోచుకున్నారని ప్రజలకు ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సిరిసిల్ల శాసనసభ్యుడు కేటీఆర్ తొమ్మిదవ ప్యాకేజీ కాల్వ పనులు పూర్తి చేయకపోవడం వల్ల ఈ ప్రాంతంలో నీళ్లు లేక వరి పంటలు ఎండిపోయాయని దీనికి కేటీఆర్ కారణమని అన్నారు. తొమ్మిదో ప్యాకేజీ పనులు పక్కనపెట్టి 12 ప్యాకేజీ కాలువ ద్వారా సిద్ధిపేటకు మీ బావ, ఫామ్ హౌజ్ కు మీ అయ్యా నీళ్లు తీసుకుపోయిండ్రు అందుకే ఈ ప్రాంత ప్రజలు ఆలోచన చేసి కేటీఆర్ కు చెంప దెబ్బ పెట్టినారన్నారు. గతంలో వడగళ్ల వాన పడి రైతులందరూ తీవ్రంగా నష్టపోతే కెసిఆర్ ఈ ప్రాంతంలో పర్యటించిన పాపాన రైతులను అదుకున్న పాపాన పోలేదని ఇప్పుడు మాత్రం పార్లమెంట్ ఎన్నికల కోసం పొలం బాట పట్టారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రైతు సెల్ మండల అధ్యక్షులు గుండాడి రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ బిపేట రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు,