డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కసుబోజుల వెంకన్న. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు యం.డి.సలీం, యెగ్గని శ్రీనివాస్, చిన్నింటి నాగేంద్ర తదితరులు కాంగ్రెస్ నాయకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కసుబోజుల వెంకన్న మాట్లాడుతూ నేటితరం యువత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల బాటలో నడవాలని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు..