రాజన్న సీరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ఇఫ్తార్ విందులో గురువారం రాత్రి సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. పందిర్ల సుధాకర్ గౌడ్ ఏర్పాటు చేసిన ఈ ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ విందులో గొల్లపల్లి కో ఆప్షన్ మెంబర్ జబ్బర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, నాయకులు కొండాపురం శ్రీనివాస్ రెడ్డి, మర్రి శ్రీనివాస్ రెడ్డి, కొమిరిశెట్టి తిరుపతి, నాగిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు