తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం, గోకవరం మండలం రంప ఎర్రంపాలెం పంచాయితీ పరిధిలో ఉన్న పెంటపల్లి గ్రామంలో ఇటీవల కొండ కృష్ణకు చెందిన తాటాకిల్లు అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. ఆ అగ్ని ప్రమాదంలో ఇంటిలో ఉన్న సామాన్లతో పాటు బీరువాలో ఉన్న 90 వేల రూపాయలు దగ్ధం అయ్యాయి. విషయం తెలుసుకున్న జగ్గంపేట నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ స్థానిక జనసేన నాయకులతో కలిసి శనివారం వారి కుటుంబాన్ని పరామర్శించి నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు అందించారు. ఈ కార్యక్రమంలో గోకవరం మండల జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అగ్ని ప్రమాద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన తుమ్మలపల్లి రమేష్
RELATED ARTICLES