బీ ఆర్ ఎస్ పార్టీకి ఒక్కొక్కరు గుడ్ బై చెప్తున్నారు. మరికొందరు పార్టీ వీడెందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఎల్లారెడ్డిపేట ఉమ్మడి మండల యాదవ్ సంఘం అధ్యక్షులు, బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మండే శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మెండే శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు పథకాలు బాగున్నాయని కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ని గెలిపించుకునేందుకు తమ సామాజిక వర్గం నుండి కృషి చేస్తానని స్పష్టం చేశారు. తన నియామకానికి సహకరించిన ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.