రేవంత్ రెడ్డి మార్చి 8న రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలో పర్యటించనున్నారు. సిరిసిల్లలో నూతన ఎస్పీ భవన్ ను ప్రారంభించనున్నారు. దీంతో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు భూమిపూజ చేయనున్నారు. వేములవాడ రాజన్నను దర్శించుకోనున్నారు. మహా శివరాత్రి సందర్భంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం గుడి చెరువు మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సభా స్థలాన్ని ఇవాళ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి పరిశీలించారు ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన విద్య, వైద్యం, రోడ్లు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. ముంపు గ్రామాలలో ఉపాధి కోసం పరిశ్రమలను స్థాపిస్తామన్నారు. జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. జిల్లా మంత్రుల సహకారంతో ముందుకు వెళ్తామని తెలిపారు.