Wednesday, January 14, 2026
spot_img
HomeTELANGANAఅభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం: J. రామకృష్ణ

అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం: J. రామకృష్ణ

ప్రజల అవసరాలు, వారి సమస్యలను ద్రుష్టిలో ఉంచుకుని వాటికి అనుగుణంగా అభివృద్ధి పనులు చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని కంటోన్మెంట్ బోర్డు మెంబర్ జన్యావుల రామకృష్ణ అన్నారు. కంటోన్మెంట్ వార్డ్ 6 లోని సీతారాంపూర్ వాసుల ఆహ్వానం మేరకు రామకృష్ణ కాలనిలో పర్యటించారు. స్థానికులతో కలిసి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. వర్షాకాలంలో వరద ఉధృతికి ఇండ్లు జలమయం అయ్యి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఈ సమస్య పరిష్కరించాలని వాపోయారు. అందుకు స్పందించిన రామకృష్ణ దగ్గరలోని కుంటలో పూడిక తీసివేసేందుకు కృషి చేస్తానని వరద నీరు నిలవకుండా వరద ప్రవాహం సాఫీగా వెళ్లేందుకు చర్యలు తీసుకుంటామని, ఇంజనీర్ల బృందంతో సర్వే చేయించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బిజెపి వార్డ్ 6 అధ్యక్షుడు ప్రతీక్ జైన్, సీనియర్ నాయకుడు అజయ్ గౌడ్, స్థానికులు స్వరూప, నరసింహాచారి, అరవింద్, ప్రసాద్, నందం గౌడ్, అశోక్, సంజీవ్ కుమార్, రజనీ కాంత్, చంద్ర మోహన్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments