కాంగ్రెస్ యువ నాయకుడు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ కుమారుడు S.ముకుల్ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వార్డ్ 2, బాలంరాయిలోని పేద ముస్లింలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రతి ఏడాది రంజాన్ నెలలో ఎమ్మెల్యే పేద ముస్లింలకు సరుకులు పంపిణీ చేయడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది అసెంబ్లీ సమావేశాలు, పలు ఇతర కార్యక్రమాలలో ఎమ్మెల్యే బిజిగా ఉండటంతో ఈ ఏడాది ఆయన కుమారుడు బస్తీలలో సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు ముకుల్ బస్తీల వారితో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. తమ కాలనీకి వచ్చి తమ కష్టసుఖాలు తెలుసుకోవడం, పండగ సందర్భంగా సరుకులు పంపిణీ చేయడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తూ తండ్రి లాగే కొడుకు కూడా మంచి మనసున్న వాడని, జీవితంలో ఎన్నో విజయతీరాలకు చేరుకొవాలని ఆకాంక్షించారు.


