Saturday, November 15, 2025
spot_img
HomeTELANGANAనీట్ కౌన్సిలింగ్ కోసం మైనారిటీ స్టేటస్ సర్టిఫికేట్ కు దరఖాస్తు చేసుకోండి: యాకూబ్ పాషా

నీట్ కౌన్సిలింగ్ కోసం మైనారిటీ స్టేటస్ సర్టిఫికేట్ కు దరఖాస్తు చేసుకోండి: యాకూబ్ పాషా

ఈ నెల 21న ప్రారంభం కానున్న నీట్ కౌన్సిలింగ్ కు హాజరయ్యే మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు ‘మైనారిటీ స్టేటస్’ సర్టిఫికేట్ కూడా కౌన్సెలింగ్ లో తప్పకుండా సమర్పించాలని, దీని కొరకు స్తానిక ఈ-సేవ సెంటర్ లలో దరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అద్యక్షులు ఎండీ. యాకూబ్ పాషా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నీట్ ద్వారా యంబీబీఎస్, బీడీఎస్, బీడీఎస్ నర్సింగ్ లలో ప్రవేశాలు జరుగుతాయని అన్నారు. గతంలో ఈ సర్టిఫికేట్ విద్యార్దులు తాము చదివిన పాఠశాలల నుండి పొందేవారని, రాష్ట్ర రెవిన్యూ శాఖ వారు గతంలో విడుదల చేసిన జీ.ఓ ప్రకారం విద్యార్దులు తహశీల్దార్ కార్యాలయం నుండే మైనారిటీ స్టేటస్ సర్టిఫికేట్ పొందాలని, ఇందుకు గాను రెవిన్యూ శాఖ విడుదల చేసిన దరఖాస్తు ఫారంతో పాటు ఓ.సి, బిసి-సి, బిసి-ఈ, బిసి- బి కుల సర్టిఫికేట్, 10వ తరగతి టి.సి, అధార్ కార్డు లేదా రేషన్ కార్డు, నీట్ -2025, ర్యాంక్ కార్డుతో ఈ-సేవ సెంటర్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని తెలిపారు. కావున మైనారిటీ వర్గాలకు చెందిన ముస్లింలు, క్రిస్టియన్ లు, సిక్కులు, జైనులు, బౌద్దులు, జోరాస్ట్రీయన్ లు ఈ విషయాన్ని గమనించాలని అన్నారు. ఇతర సమాచారం కోసం మరియు మైనారిటీ స్టేటస్ దరఖాస్తు ఫారం కొరకు 8520860785, నంబర్ కు సంప్రదించాలని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments